Header Banner

Actor Arya: నటుడు ఆర్యకు బిగ్ షాక్... ఇల్లు రెస్టారెంట్లపై ఐటి దాడులు!

  Wed Jun 18, 2025 15:28        Politics

చెన్నైలోని "సీ షెల్" రెస్టారెంట్లపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు బుధవారం ఉదయం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ రెస్టారెంట్ చైన్‌తో గతంలో సంబంధాలున్న ప్రముఖ తమిళ నటుడు ఆర్య నివాసంలోనూ ఏకకాలంలో సోదాలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. అన్నా నగర్, వేలచ్చేరి సహా నగరంలోని పలు "సీ షెల్" రెస్టారెంట్ శాఖలలో ఉదయం నుంచే ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఈరోజు ఉదయం ఐటీ అధికారుల బృందాలు "సీ షెల్" రెస్టారెంట్ల కార్యాలయాలు, శాఖలకు చేరుకున్నాయి. అన్నా నగర్ బ్రాంచ్‌లో ఐదుగురికి పైగా అధికారులు రెండు వాహనాల్లో ఉదయం 8 గంటలకు చేరుకుని తనిఖీలు ప్రారంభించినట్లు తెలిసింది. పోలీసుల బందోబస్తు నడుమ ఐటీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో పూనమల్లి హై రోడ్‌ లో ఉన్న నటుడు ఆర్య నివాసంలో కూడా మరో ఐటీ బృందం సోదాలు చేపట్టింది.

 

ఇది కూడా చదవండి: Nara Lokesh: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో లోకేశ్ భేటీ! పలు అంశాలపై ఇరువురి మధ్య చర్చ!

 

గతంలో నటుడు ఆర్య ఈ అరేబియన్ రెస్టారెంట్ చైన్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ఆర్య ఈ రెస్టారెంట్లను కేరళకు చెందిన కున్హి మూసా అనే వ్యాపారవేత్తకు విక్రయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కేరళలో కున్హి మూసాకు సంబంధించిన ఆస్తులపై ఐటీ శాఖ నిఘా పెట్టిందని, ఆ విచారణలో భాగంగానే చెన్నైలోని ఈ రెస్టారెంట్లు, ఆర్య నివాసంపై దాడులు జరుగుతున్నాయని భావిస్తున్నారు. ప్రధానంగా రెస్టారెంట్ ఆర్థిక లావాదేవీలు, యాజమాన్య మార్పులకు సంబంధించిన అంశాలపై ఐటీ అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. నటుడు ఆర్య కేరళకు చెందినవాడైనప్పటికీ, "అరిన్తుమ్ అరియామలుమ్" సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసి, పలు విజయవంతమైన చిత్రాలతో స్టార్‌గా ఎదిగారు. ప్రస్తుతం ఆయన పా. రంజిత్ దర్శకత్వంలో "వెట్టువమ్" చిత్రంలో నటిస్తున్నారు. ఈ దాడులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
 

ఇది కూడా చదవండి: Adabidda nidhi Scheme: ఏపీ మహిళలకు శుభవార్త.. నెలకు రూ. 1500పై కీలక అప్‌డేట్! ఈ పథకం త్వరలోనే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Free bus: ఆడవాళ్ళకి అదిరిపోయే శుభవార్త... ఆగస్టు 15 నుంచి అమలు!

 

Pakistan: భారత్ పై యుద్ధం తప్ప మరో దారి లేదు.. పాకిస్థాన్ సంచలన వ్యాఖ్యలు!

 

Rythu Bharosa: రైతన్నలూ.. బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి! పంట పండించే ప్రతి ఎకరాకు!

 

Chandrababu warning Jagan: పులివెందుల రాజకీయం చేస్తే.. తోక కట్ చేస్తా! ఎవరు తప్పు చేసినా..

 

అధికారులు అలర్ట్.. చంద్రబాబు హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు! విశాఖపట్నంలో సీఎం పర్యటన..

 

ఏసీబీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తతలు! మాజీ మంత్రికి మద్దతుగా వచ్చిన కార్యకర్తలు అరెస్ట్!

 

ఆ జిల్లా టమాటా రైతులపై ఊజీ ఈగ పిడుగు! దీంతో కొనేవారే..

 

సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్! FDలపై గరిష్ఠ వడ్డీ ఇస్తున్న బ్యాంకులు!

 

అసైన్డ్‌ భూములకు రెక్కలు.. ఈ డీల్‌తో రంగం.. ఆ జిల్లా కేంద్రంగా విశాఖ అధికారుల భేటీలు!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.3 లక్షలు..కారణం ఇదే!

 

ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్‌సైట్‌: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!

 

సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమా, న్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #actor aryas #house raided #department #It Ride